Ticker

6/recent/ticker-posts

మంత్రి నారా లోకేష్ గారికి బహుజనుల సమస్యలను వివరించిన బహుజన సేనాని మత్తే బాబి.

  VSK NEWS ;  మంత్రి నారా లోకేష్ గారికి బహుజనుల సమస్యలను వివరించిన బహుజన సేనాని మత్తే బాబి.


సమస్యలను కచ్చితంగా పరిష్కరించేలా చూస్తానని తెలిపిన మంత్రి లోకేష్ గారు

గత ప్రభుత్వంలో ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటాను హామీ ఇచ్చిన యువ నాయకులు లోకేష్ గారు 


   మంగళగిరి ఉండవల్లి నివాసంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి,ఐటీ, మానవ వనరులు,రియల్ టైమ్ గవర్నెన్స్ మంత్రి గౌరవ శ్రీ నారా లోకేష్ గారిని కలిసి బహుజనులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వివరించి గత ప్రభుత్వంలో రద్దు చేసిన 26 సంక్షేమ పథకాలను తిరిగి పునరుద్ధరణ చేయాలని,గత ప్రభుత్వం ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితచరిత్రను విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చి అందించాలని,బహుజనులను రానున్న రోజుల్లో సామాజిక సంస్కృతిక ఆర్థిక రంగాల్లో ముందుకు తీసుకువెళ్లాలని, 50 సంవత్సరాల నిండిన సామాజిక ఉద్యమకారులకు పెన్షన్ అందించే ఆలోచన చేయాలని బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షులు,ఆర్.పి.ఐ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మత్తే బాబి కోరారు,ఈ కార్యక్రమంలో బహుజన సేన ప్రతినిధులు పాల్గొన్నారు.