Ticker

6/recent/ticker-posts

ఏపీకి కేంద్రం శుభవార్త.. ఈ 10 జిల్లాలకు మహర్దశ, నిధులు విడుదల


 ఏపీకి కేంద్రం శుభవార్త.. ఈ 10 జిల్లాలకు మహర్దశ, నిధులు విడుదల


ఏపీకి కేంద్రం మరో శుభవార్త చెప్పింది.

10 చేనేత క్లస్టర్లను మంజూరు చేశారు

ఈ మేరకు నిధుల్ని కూడా విడుదల


ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం తీపికబురు చెప్పింది.. కొత్తగా రాష్ట్రానికి 10 చేనేత క్లస్టర్లను మంజూరు చేసింది. 

చేనేత కార్మికుల్ని ప్రోత్సహిస్తూ.. కొత్త డిజైన్ల ద్వారా ఆదాయం పెంచందుకు కేంద్రం క్లస్టర్ల కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.

 ఈ మేరకు ఏపీలోని కాకినాడ, తూర్పుగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, శ్రీసత్యసాయి, అనంతపురం ఒక్కొక్కటి.. తిరుపతి జిల్లాలో రెండు క్లస్టర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనల్ని పంపింది. 


ఈ మేరకు కేంద్రం ఆమోదం తెలిపింది.


ఈ నిధులు 10 రోజుల్లో రాష్ట్రానికి జమకానున్నాయి.. సంక్రాంతి నాటికి క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించి పనులు ప్రారంభించనున్నారు. ఈ క్లస్టర్ల ఏర్పాటుతో 2వేలమంది చేనేతలకు లబ్ధి కలుగుతుందని చెబుతున్నారు.

మరోవైపు చేనేత కార్మికులకు నూతన డిజైన్లపై శిక్షణ ఇచ్చేందుకు డిజైనర్‌ కూడా క్లస్టర్‌టలో అందుబాటులో ఉంటారు. అలాగే కేంద్రం అవసరమైన పరికరాలను అందుబాటులోకి తెచ్చేందుకు క్లస్టర్‌ డెవలప్‌ ఎగ్జిక్యూటివ్‌ను నియమిస్తుంది. రాష్ట్రంలో ధర్మవరం చేనేత రంగంలో కీలకమైన ప్రాంతం అని చెప్పాలి. అక్కడ చేనేతలు కంచిపట్టు చీరల్ని తయారు చేస్తారు.. ఇవి ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేస్తారు. ఈ మేరకు ధర్మవరం చేనేతల్ని ప్రోత్సహించేందుకు రూ.34 కోట్లతో మెగా క్లస్టర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు డీపీఆర్‌ను కూడా రూపొందిస్తున్నారు. అలాగే పిఠాపురం, అంగరలో కూడా రూ.14 కోట్లతో మెగా క్లస్టర్ల ఏర్పాటు కోసం సర్వే చేస్తున్నారు. వీటిని ఏర్పాటు చేసేందుకు కేంద్రం 90శాతం నిధులు మంజూర చేయనుంది.. రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 10శాతం భరించనుంది. కేంద్రానికి డీపీఆర్‌లు పంపించిన తర్వాత నిధులు విడుదల చేస్తారు. మొత్తానికి ఈ క్లస్టర్లతో ఆయా జిల్లాలకు మహర్దశ అని చెప్పాలి.