VSK NEWS ; ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను సాకారం చేస్తాం": దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.
ఎన్టీయార్ వర్ధంతి సందర్భంగా క్యాంపు కార్యక్రమంలో ఎన్టీయార్ విగ్రహానికి నివాళులు అర్పించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.
దెందులూరు నియోజకవర్గంలోని గ్రామీణ స్థాయిలోని ప్రతి పేదవాడికి మూడు సెంట్లు ఇంటి స్థలాన్ని ఉచితంగా అందించి వారి సొంత ఇంటికలను సాకారం చేయడానికి చర్యలు చేపట్టినట్టు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం నియోజకవర్గంలోని పలువురు కూటమి నాయకులు, అధికారులు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్టీయార్ వర్ధంతి సందర్భంగా దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకులతో కలిసి ఎన్టీయార్ విగ్రహానికి పూల మాల వేసి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఘనంగా ఎన్టీయార్ కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి వివరించగా సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపడతామని దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం లో పేదలకు ఇళ్ల స్థలాలు నిర్మిస్తామంటూ జగన్ మోసం చేశారని, నివాసయోగ్యంకాని ప్రదేశాలను ప్రజలకు కేటాయిస్తూ వాళ్లని మోసం చేశారని, కాలనీల నిర్మాణాల పేరుతో కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును వైసిపి నాయకులు దోచుకున్నారని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేదవాడి సొంతం ఇంటి కలను సాకారం చేసేలా చర్యలు చేపట్టి వారికి అండగా నిలుస్తున్నామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.

Social Plugin