Ticker

6/recent/ticker-posts

ఏలూరు జిల్లా తుది ఓటర్ల జాబితా విడుదలచేసిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

ఏలూరు జిల్లా తుది ఓటర్ల జాబితా విడుదలచేసిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

 


 ఏలూరు జిల్లా తుది ఓటర్ల జాబితా విడుదలచేసిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.


జిల్లాలో 16,37,555 ఓటర్లు...

పురుష ఓటర్లు 7,99,283 మంది, మహిళా ఓటర్లు 8,38,146 మంది, థర్డ్ జెండర్ ఓటర్లు 126..

వీరుకాక 678 మంది సర్వీసు ఓటర్లు..


భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025 షెడ్యూల్ ప్రకారం ఏలూరు జిల్లాకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను సోమవారం స్ధానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విడుదల చేశారు. నియోజకవర్గం వారీగా మొత్తం ఓటర్లు, సర్వీసు ఓటర్ల వివరాలను అందులో పొందుపర్చారు.  


జిల్లాలో 16,37,555 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఇందులో పురుష ఓటర్లు 7,99,283 మంది, మహిళా ఓటర్లు 8,38,146 మంది, థర్డ్ జెండర్ ఓటర్లు 126 మంది ఉన్నారన్నారు. వీరుగాక 678 మంది సర్వీసు ఓటర్లుగా నమోదైవున్నారన్నారు.  


జిల్లాలోని ఉంగుటూరు నియోజకవర్గంలో 1,01,586 మంది పురుష ఓటర్లు, 1,04,914 మంది మహిళా ఓటర్లు, 06 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కలిపి మొత్తం 2,06,506 మంది ఓటర్లు ఉన్నారన్నారు. మరో 193 మంది సర్వీసు ఓటర్లుగా ఉన్నారు. దెందులూరు నియోజకవర్గంలో 1,09,181 మంది పురుష ఓటర్లు, 1,15,318 మంది మహిళా ఓటర్లు, 08 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కలిపి మొత్తం 2,24,507 మంది ఓటర్లు ఉన్నారన్నారు. మరో 101 మంది సర్వీసు ఓటర్లుగా ఉన్నారు.

ఏలూరు నియోజకవర్గంలో 1,12,032 మంది పురుష ఓటర్లు, 1,22,447 మంది మహిళా ఓటర్లు, 47 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కలిపి మొత్తం 2,34,526 మంది ఓటర్లు ఉన్నారన్నారు. మరో 115 మంది సర్వీసు ఓటర్లుగా ఉన్నారు. పోలవరం(ఎస్టీ) నియోజకవర్గంలో 1,22,961 మంది పురుష ఓటర్లు, 1,31,381 మంది మహిళా ఓటర్లు, 09 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కలిపి మొత్తం 2,54,351 మంది ఓటర్లు ఉన్నారన్నారు. మరో 68 మంది సర్వీసు ఓటర్లుగా ఉన్నారు.

 చింతలపూడి(ఎస్సీ) నియోజకవర్గంలో 1,34,171 మంది పురుష ఓటర్లు, 1,38,705 మంది మహిళా ఓటర్లు, 41 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కలిపి మొత్తం 2,72,917 మంది ఓటర్లు ఉన్నారన్నారు. మరో 72మంది సర్వీసు ఓటర్లుగా ఉన్నారు. నూజివీడు నియోజకవర్గంలో 1,18,055 మంది పురుష ఓటర్లు, 1,20,868 మంది మహిళా ఓటర్లు, 10 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కలిపి మొత్తం 2,38,933 మంది ఓటర్లు ఉన్నారన్నారు. మరో 50 మంది సర్వీసు ఓటర్లుగా ఉన్నారు. కైకలూరు నియోజకవర్గంలో 1,01,297 మంది పురుష ఓటర్లు, 1,04,513 మంది మహిళా ఓటర్లు, 05 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కలిపి మొత్తం 2,05,815 మంది ఓటర్లు ఉన్నారన్నారు. మరో 79 మంది సర్వీసు ఓటర్లుగా ఉన్నట్లు తెలిపారు.