VSK NEWS: శుక్రవారం సిబ్బంది యొక్క సంక్షేమ కొరకు నిర్వహించే సంక్షేమ దివాస్ ను పురస్కరించుకొని పోలీసు సిబ్బంది యొక్క శాఖాపరమైన సమస్యలపై ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ వారు ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించినారు.
జిల్లాలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్ లు, విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది, ఏ.అర్ సిబ్బంది హోమ్ గార్డ్స్ వారి యొక్క సమస్యలు గురించి ఎస్పీ వారికి తెలియ చేసినారు.
జిల్లా ఎస్పీ సిబ్బంది నుండి వినతులను స్వయంగా స్వీకరించి, వారి యొక్క సమస్యలను సమగ్రంగా అడిగి తెలిసికొని జిల్లా ఎస్పీ సానుకూలంగా స్పందించి వాటిపై సత్వరమే తగు పరిష్కార చర్యలు తీసుకుంటామని పోలీస్ సిబ్బందికి భరోసా కల్పించారు.
ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కారించలని సంబంధిత పోలీస్ ప్రధాన కార్యాలయం అధికారులకు ఎస్పీ ఆదేశించారు.

Social Plugin