VSK NEWS : భీమడోలు మండలం అంబరుపేట శివారు కొండ్రెడ్డి నగర్ గ్రామంలో జాతీయ రహదారి 16 పై జరిగిన రోడ్డు ప్రమాదంలో గుబ్బ తిరుపతి స్వామి అను వ్యక్తి మృతి చెందినాడు. వివరాల్లోకి వెళితే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం గుంటపల్లి గ్రామానికి చెందిన గుబ్బ తిరుపతి స్వామి@ బాబ్జీ (56 సం.లు) వ్యక్తి వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నట్లు అతనికి సొంతంగా మారుతి ఎర్టిగా నెం.AP 39MN 5843 గల కారు ఉన్నట్లు దానిలో వారికి పరిచయస్తులైన గంట గోవిందు గారి కుటుంబంతో కలిసి ది 01.01.2025 తెదీ నాడు తన కారు వేసుకుని పెద్ద తిరుపతి దైవ దర్శనానికి వెళ్ళి, వారి కార్యక్రమాలు పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి వెళుతుండగా దారి మధ్యలో ది 03.03.2025 తేదీ ఉదయం సుమారు 5 గంటల సమయంలో భీమడోలు మండలం కొండ్రెడ్డి నగర్ హైవేలో ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చేసరికి తిరుపతి స్వామి నడుపుతున్న కారుకు ఎదురుగా అదే దిశలో వెళుతున్న AP 16TJ 5359 నెంబర్ గల ట్రాలీ లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో తిరుపతి స్వామి నడుపుతున్న కారు సదరు ట్రాలీ లారీను వెనుక నుండి బలంగా ఢీ కొనడంతో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయిపోయి కారు నడుపుతున్న తిరుపతి స్వామి తలకు బలమైన దెబ్బ తగిలి స్పృహ కోల్పోగా కారులోని మిగతా వారికి స్వల్ప గాయాలు అయినవి.
వారంతా హైవే పోలీసుల సహాయంతో 108 అంబులెన్స్ లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ వైద్యం పొందుతూ తిరుపతి స్వామి ఉదయం 8:30 గంటలకు చనిపోయినాడు. దానిపై మృతుడి అల్లుడైన విశ్వనాధుని పార్థసారథి ఇచ్చిన ఫిర్యాదు పై భీమడోలు పోలీస్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Social Plugin