VSK NEWS : ఏలూరు జిల్లా మహిళా పోలీస్ కానిస్టేబుల్ దేహ ధారుడ్య పరీక్షలు ప్రారంభించారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, పోలీస్ పెరేడ్ గ్రౌండ్ జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ పర్యవేక్షణలో ప్రారంభం జరిగింది.
దేహ ధారుడ్య పరీక్షల నిర్వహణ:
కేతిక పరిజ్ఞానం, సీ.సీ.టీవీ పర్యవేక్షణ, డ్రోన్ కెమేరాలు ద్వారా పారదర్శకత మరియు నిష్పక్ష పాతముగా దేహ ధారుడ్య నిర్వహణ పోలీసు అధికారులు చేశారు.
APSLPRB వారు 490 మహిళా అభ్యర్థి హాల్ టికెట్ ఇవ్వగా 242 మంది అభ్యర్థులు హాజరుకాగా వారిలో 102 మహిళా అభ్యర్థులు క్వాలిఫై అయినారు. దేహ ధారుడ్య పరీక్షలను APSLPRB వారి యొక్క నిబంధనల ప్రకారం నిర్వహణ.
అభ్యర్థులు తప్పనిసరిగా తీసుకురావలసిన సర్టిఫికెట్లు
ఎస్‌ఎస్‌సి మరియు ఇంటర్మీడియట్ మార్క్‌ల లిస్ట్.
డిగ్రీ మార్క్‌ల లిస్ట్, ప్రొవిజనల్ లేదా ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్.
కమ్యూనిటీ సర్టిఫికేట్.
క్రిమి లేయర్ సర్టిఫికేట్ (నోటిఫికేషన్ తేదీ తరువాత తీసుకోవాలి).
స్టడీ సర్టిఫికెట్ 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏ, బి, సి సర్టిఫికేట్లు.
ట్రైబల్ సర్టిఫికేట్/ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్.
పోలీస్ ఎగ్జిక్యూటివ్ లేదా పోలీస్ పిల్లల సంబంధిత సర్టిఫికెట్.
ఎక్స్ సర్విస్ మెన్ మరియు మెరిటోరియస్ స్పోర్ట్స్ సర్టిఫికెట్.
స్కోర్ కార్డ్ (ఒరిజినల్ రిజల్ట్).
స్టేజ్-1 మరియు స్టేజ్-2 అప్లికేషన్లు.
ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్
సెల్ ఫోన్లు, వాచీ లను గ్రౌండ్ లోకి అనుమతించరు.
ఒరిజినల్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా చూపించాలి.
సర్టిఫికెట్లు అందించకపోతే అభ్యర్థిత్వం తిరస్కరించబడుతుంది.
1600 మీటర్ల పరుగులో డిస్ క్వాలిఫై అయినా వారిని మిగతా ఈవెంట్ లకు అనుమతి లేవు
గర్భిణీ మహిళలు మినహాయింపు పొందడానికి SCTPC-PMTPET@slprb.appolice.gov.inకు పత్రాలు పంపాలి.
మహిళా అభ్యర్థుల కోసం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు గా ఏలూరు జిల్లా ఎస్పీ తెలియచేసినారు.





Social Plugin