Ticker

6/recent/ticker-posts

దెందులూరులో " చింతమనేని" జన్మదినం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు కోడిగుడ్లు పంపిణీ





 VSK TV : దెందులూరులో " చింతమనేని" జన్మదినం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు కోడిగుడ్లు పంపిణీ


దెందులూరు 

ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జన్మదిన వేడుకలు దెందులూరు ఆదిత్య ఫ్యాక్టరీలో ఏలూరు జిల్లా TNSF అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే చింతమనేని జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు దెందులూరు గ్రామంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు పౌష్టికాహారం అయిన ఆహారమైన కోడిగుడ్లు  అందజేశారు. 
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమానికి అహర్నిశలు  కృషి చేస్తున్నారని, ప్రజల అవసరాలు తెలుసుకుని వారికోసం అనుక్షణం తప్పించి వారికి లబ్ధికూర్చే నిజమైన నాయకుడు డైనమిక్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో వీరమాచినేని ప్రభాకర్, పెనుబోయిన మహేష్ యాదవ్, గారపాటి కొండయ్య చౌదరి, సంపంగి వేణుగోపాల తిలక్, సర్పంచ్ తోట ఏసమ్మ ,  వేమూరి మురళి , ఇప్పిలి వెంకటేశ్వరరావు,NRI విభాగం కొడాలి హరీష్, ఆకుల రామకృష్ణ, నెరుసు మారేశ్వరరావు, బొత్స కిషోర్, మరిదు మాణిక్యం, ఎంపీటీసీ పెనుబోయిన శేషారత్నం, కొలుసు నాని,దుసరి మహేష్, మరీదు శ్రీను, కూరపాటి కిషోర్, వైస్ ప్రెసిడెంట్ బార్నాల అప్పారావు, కాజా రాంప్రసాద్, నెదురు సతీష్, నక్క చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.